ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుందుకే కేటీఆర్ కు ఏసీబీ నోటీసుల
★వైరా బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు
నేటి గదర్ న్యూస్, వైరా: ప్రజా పాలన ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని 420 హామీల అమలుకై ప్రశ్నిస్తుందుకే కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు అని వైరా బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలను అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతూ, ప్రశ్నిస్తూ, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరోసారి ఏసీబీ నోటీసులు ఇవ్వడం చాలా దుర్మార్గమని అన్నారు. పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టే విధంగా అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఎంతో అద్భుతంగా హైదరాబాద్ నగరంలో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించడం జరిగిందని, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ కక్షసాధింపు చర్యలు చేపడుతూ ఏదోరకంగా కేటీఆర్ ను కేసులో ఇరికించాలని, ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నాడని, ఇలాంటి బెదిరింపు ధోరణులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. అభివృద్ధి చేసింది ఎవరో అవినీతి చేస్తున్నది ఎవరో తప్పకుండా వాస్తవాలు త్వరలో బయటికి వస్తాయని గిరిబాబు అన్నారు.









