రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) 15:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు అంగన్వాడీ కేంద్రంలో అక్కన్నపేట సెక్టార్ సూపర్వైజర్ భారతి ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అంగన్వాడి సెక్టార్ సూపర్వైజర్ భారతి మాట్లాడుతూ అంగన్వాడీలో 03 సంవత్సరాల నుండి 05 సంవత్సరాల లోపు పిల్లలను అంగన్వాడీకీ పంపాలని తెలిపారు.అంగన్వాడి బడిబాట కార్యక్రమంలో గ్రామ ప్రజలు తల్లిదండ్రులు సహకరించి పిల్లలను అంగన్వాడీలో చేర్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ భారతీ అంగన్వాడీ టీచర్ సుమలత మరియు ఆశవర్కర్ మానస పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 197









