రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూన్ 15:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లి గ్రామంలో సోమవారం నాడు మండల తహసిల్దార్ రజనీకుమారి ఆధ్వర్యంలో భూభారతి రెవెన్యూ సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మండల తహసిల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ దంతపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ప్రజల నుండి 70 దరఖాస్తులు వచ్చాయని,వాటిని పరిశీలించి త్వరలో పరిష్కారం చేస్తామని తెలిపారు.భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులో ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.నేడు జరగబోయే పర్వతాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సును ప్రజలు విజయవంతం చేయాలని తెలిపారు.ఇట్టి అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల ఆర్ఐ గౌస్ మైయినోద్దీన్, గోపి మండల రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 143









