రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) 15:- ప్రభుత్వ ఆసుపత్రికి 24 గంటల విద్యుత్ సౌకర్యం కోసం స్థానిక మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆదేశాల మేరకు రామాయంపేట మండల కేంద్రంలోని 33/11 కె.వి సబ్ స్టేషన్ నుండి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మీదుగా ప్రభుత్వ ఆసుపత్రి వరకు హెచ్డి లైన్ ఏర్పాటు కోసం కాంగ్రెస్ నాయకులు విద్యుదీకరణ పనులు చేపట్టారు.ఈ సందర్భంగా టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు మాట్లాడుతూ విద్యుత్ స్తంభాలు వేయడానికి కాంగ్రెస్ నాయకులు ముందస్తు చర్యలు తీసుకుంటుంటూ కొంతమంది విద్యుత్ స్తంభాలు వేయకుండా హెచ్డి లైన్ వేయకుండా అడ్డుపడుతుండగా కాంగ్రెస్ నాయకులు ముందుకు వచ్చి పోలీసుల సహాయంతో సమస్యను పరిష్కరించి ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చిన అభివృద్ధి పనులను ఆపేది లేదంటూ విద్యుదీకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.ఈ విద్యుదీకరణ ఏర్పాటు కోసం సుమారుగా 10 లక్షల రూపాయలతో ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు రోగుల ఆపరేషన్ల సౌకర్యార్థం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మూడు రోజుల్లో పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు.అదేవిధంగా పట్టణంలోని రాజేంద్రనగర్ సాయిబాబా గుడి ప్రాంతంలో కూడ విద్యుకరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.పట్టణంలో జరుగుతున్న ఈ అభివృద్ధి పనులకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.









