రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూన్ 15:- మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో సోమవారం నాడు మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డుకు చెందిన కోనాపురం కీశే.వైఎస్ వెంకటి భార్య రేణుక కు సీఎంఆర్ఎఫ్ క్రింద 32,000 వేల చెక్కును స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా అందజేశారు.బాధిత కుటుంబానికి ఆర్థికసాయం చేసినందుకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దేమే యాదగిరి, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్, షేక్ ఇమామ్,బీర రామచంద్రం, మేతరి కిషన్,ముత్తరగల్ల పోచయ్య, బట్టి సత్యం,మంగలి సత్యం, మంగలి పవన్,బీర స్వామి,బీర ఆంజనేయులు,గాయంతి వెంకటేశం,దోనేటి గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 122









