రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) జూన్ 15:- తెలంగాణ క్రీడా పాఠశాలలో హకీంపేట్, కరీంనగర్ మరియు అదిలాబాద్ ప్రస్తుతం 4వ తరగతిలో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థిని,విద్యార్థులు ఈనెల 19న ఉదయం 9 గంటల నుండి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానం రామాయంపేట నందు మండల స్థాయి ఎంపికలు నిర్వహించబడతాయని మండల ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు.ఎంపికైన బాల బాలికలకు ఈ నెల 23వ తేదీ నుండి 26వ తేదీ వరకు జిల్లాస్థాయి ఎంపికలు జరుగుతయాని పేర్కొన్నారు.మండల స్థాయి క్రీడల ఎంపిక కొరకు1.ఎత్తు 2.బరువు 3.30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్ 4.స్టాండింగ్ బ్రాడ్ జంప్.5.6×10 మీటర్ల షటిల్ రన్. 6.వర్టికల్ జంప్.7.ఫ్లెక్సీబిలిటీ టెస్ట్.8.1kg మెడిసిన్ బాల్. ఫుట్.9.800 మీటర్ల పరుగు పందెం పరీక్షలు ఉంటాయని తెలిపారు.ఈ క్రీడలకు కనీస అర్హత 1.పుట్టినతేది 01.09.2016 నుండి 31.08.2017 మద్య మాత్రమే ఉండాలి,2.3వ తరగతి చదివిన ప్రొగ్రెస్ రిపోర్ట్,3.ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న బోనాఫైడ్ 4.ఆధార్ కార్డ్ జిరాక్స్,5.కులం సర్టిఫికెట్,6.బర్త్ సర్టిఫికెట్,7.పాసుపోర్టు సైజు ఫోటోలు 6 తీసుకురావాలని పేర్కొన్నారు.పై వివరాలతో 19వ తేదీన హాజరైన బాలబాలికలకు మండల విద్యాధికారి ద్వారా స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడుతుందని తెలిపారు.రిజిస్ట్రేషన్ అయిన వారు మాత్రమే ఈ ఎంపికలలో పాల్గొనడానికి అర్హులు.కావున ఇట్టి అవకాశాన్ని తల్లిదండ్రులు,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు వినియోగించుకోవాలని తెలిపారు.పూర్తి వివరాల కోసం నాగ చందర్ పిడి.94400 94808 సిద్ధ రాములు పిఇటి 77940 50660 నెంబర్లకు సంప్రదించాలని తెలియపరచారు.









