డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా వెసులుబాటు..ప్రభుత్వం ఆర్ధిక సహాయం.
ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, మౌళిక వసతులపై సచివాలయంలో అధికారులతో సమీక్షించడం జరిగింది
✅మొండి గోడలతో అసంపూర్తిగా ఉన్న లక్షా 61 వేల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను గుర్తించడం జరిగింది.
✅రూ.640 కోట్లతో పూర్తిచేసి 98000 మంది లబ్దిదారులకు ఇప్పటికే కేటాయించడం జరిగింది.
✅డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పూర్తి చేయడానికి కాంట్రాక్టర్ ముందుకు రాని పక్షంలో..లబ్ధిదారులే ఇండ్లను నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందిస్తుంది.
✅ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల వరకు ఆర్ధిక సహాయం.
✅ఇండ్ల స్థలాలు లేని, అర్హత కలిగిన లబ్ధిదారులకు అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు.
✅అర్హులను గుర్తించి ఇండ్లను కేటాయించాలని అధికారులకు ఆదేశం
✅నిరుపేదలకు నీడను కల్పించడమే ప్రభుత్వ తక్షణ కర్తవ్యం









