నేటి గదర్ న్యూస్,
చింతకాని మండల ప్రతినిధి.
తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రతిష్టత్మాకంగా చేపడుతున్న రైతు భరోసా నిధులు విడుదల గురించి రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు సమస్య ల పై సంభాషించారు. రైతులుకు ఏ విధమైన సమస్య లు వచ్చిన వెంటనే సంబంధిత అధికారుల ను సంప్రదించాలని కోరారు. అధికారులు రైతులకు అందుబాటులో ఉండి, వారికి తగు సలహాలు, సూచనలు చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో చింతకాని మండలం లచ్చగూడెం గ్రామం ఆత్మ డైరెక్టర్ కొప్పుల గోవిందరావు . చింతకాని మండల ఎంపీడీవో చుంచు శ్రీనివాసరావు, తూము వెంకటేశ్వరరావు, కోటయ్య, కొల్లి గోవిందరావు,గొడుగు రమేష్, శ్రీరాముల నాగేశ్వరరావు, గ్రామపంచాయతీ సెక్రటరీ నరేష్, వ్యవసాయ విస్తరణ అధికారులు.రాము మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొనడం జరిగినది..









