+91 95819 05907

ఆశ వర్కర్స్ కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి.

ఆశ వర్కర్స్ కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి.

సిఐటియూ వైరా పట్టణ కన్వీనర్ అనుమోలు రామారావు

నేటి గదర్ న్యూస్, వైరా:
ఆగస్టు 25న జరిగే ఆశ వర్కర్స్ కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియూ వైరా పట్టణ కన్వీనర్ అనుమోలు రామారావు కోరారు. సోమవారం సిఐటియూ వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని వైరా పి.హెచ్చ్.సి అధికారి డాక్టర్ హర్షకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా
సిఐటీయూ వైరా పట్టణ కన్వీనర్ అనుమోలు రామారావు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఆశ వర్కర్స్ తో వెట్టి చాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వాలు ఆశ వర్కర్ల సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. గత రెండు నెలలుగా ఆశ వర్కర్లకు వేతనాలు అందక అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని, ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అవకాశం ఉన్న ఆశ వర్కర్లను రెండో ఏఎన్ఎంలుగా గుర్తించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని తదితర సమస్యల పరిష్కారానికి ఆగస్టు 19న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వద్ద, ఆగస్టు 25న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాలు చేపట్టామని తెలిపారు .
సెప్టెంబర్ ఒకటో తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం ఉంటుందని, అప్పటికి ప్రభుత్వం సమస్యలపై స్పందించకపోతే ఆశ వర్కర్లు నిరవధిక నిరాహార దీక్ష చేపడతారని అన్నారు. ఆగస్టు 25న కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాకు అధిక సంఖ్యలో ఆశా వర్కర్లు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు శైలజ, రేణుక, దీప, హైమావతి, మహేశ్వరి, లలిత తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !