*నేటి గదర్ న్యూస్ గుండాల*,గుండాల మండల కేంద్రం సోమవారం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న 375 వ జయంతి వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలో సర్దార్ పాపన్నకి జేజేలు కొడుతూ భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం చిత్రపటానికి పాలు పోసి పూలమాల వేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులుమాట్లాడుతూ జనగామ జిల్లా ,రఘునాథపల్లి మండలం, కిలాసపూర్ గ్రామం 1650 సంవత్సరం ఆగస్టు 18న గీత కార్మికుడి కుటుంబంలో జన్మించి సామాన్యుడి జీవితం కొనసాగిస్తూ పాపన్న తనకున్న ఐక్యతతో ప్రజలను పిడిస్తున్న కుల వ్యవస్థ భూస్వాములపై పోరాడి విప్లవంతో మార్పును తీసుకువచ్చి 30 సంవత్సరాలు పరిపాలించాడని అన్నారు. పాపన్న జయంతిని ప్రతి సంవత్సరం ప్రభుత్వ కార్యక్రమం గా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం చేయగా బీసీ వెల్ఫేర్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉత్తర్వులు జారీ చేశారని, ట్యాంకుబండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు









