+91 95819 05907

కొత్తగూడెం మెయిన్ రోడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలి.

గంధం టవర్స్ వద్ద మురుగు నీరును తొలగించాలి

ప్రజల ఆరోగ్యం, ప్రాణాలను కాపాడాలి.

సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ

సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం.

నేటి గదర్ న్యూస్, వైరా:
వైరా మున్సిపాలిటీ పరిధిలోని వైరా – కొత్తగూడెం రోడ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని, గంధం టవర్స్ వద్ద మురికి నీటిని వెంటనే తొలగించాలని సిపిఐ(ఎం) బ్రాహ్మణపల్లి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ కొత్తగూడెం రోడ్ లో గంధం టవర్స్ వద్ద డ్రైనేజీ నీరు మెయిన్ రోడ్డు పై పంట కాలువలా ప్రవహిస్తుందని అన్నారు. గంధం టవర్స్ అపార్ట్మెంట్ లో దాదాపు 60 కుటుంబాలు ఉంటున్నాయని, వాళ్లందరూ వాడకం చేసిన మురికి నీరు డ్రైనేజీ లేక రోడ్డు మీదకు వస్తున్నాయని అన్నారు. మురికి నీరు జాతీయ రహదారిపై కాలువలా ప్రవహిస్తుందని, విపరీతమైన దుర్వాసన వస్తుందని, ఎదురుగానే అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శిస్తున్నారు. వాహానాలు వెళ్ళెటప్పుడు రోడ్డు మీద వెళుతున్న ప్రయాణికులు, బాటసారిలపై మురుగు నీరు పడుతుందని తెలిపారు. మురుగు నీటి నుంచి వచ్చే దుర్వాసనతో అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉందని, ఎడతెరిపిలెకుండా పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ లాంటి విష జ్వరాలు ఇప్పటికే ప్రారంభం అయినాయని, విష జ్వరాల భారీ నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలని, వెంటనే డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని, పారిశుధ్యం మెరుగు పరచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించాలని, వైరా మున్సిపాలిటీలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి తక్షణమే ప్రత్యేకమైన నిధులు కేటాయించి వైరా రింగ్ రోడ్డు నుండి వైరా ప్రాజెక్టు అలుగు వాగు వరకు డ్రైనేజీ నిర్మాణం చేసి మురుగు నీరు పంపించే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి నిర్మాణాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, బ్రాహ్మణపల్లి శాఖా కార్యదర్శి, వైరా పట్టణ కమిటీ సభ్యులు పైడిపల్లి సాంబశివరావు, కొంగర సుధాకర్, వేల్పుల మైఖేల్, గుత్తా వాసుదేవరావు, కొంగర నాగేశ్వరావు, చింతోజు నాగేశ్వరావు, వెల్పల రాములు, చావా కళావతి, కొంగర విమల, కాండ్ర రవి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !