దాతలు ఆర్థిక సహాయం చెయ్యండి… ఆదివాసి యువకుడు వేడ్కోలు
★జాతీయ స్థాయి అండర్ -14 బీ గ్రూప్ కు ఎంపిక
★ తమిళనాడు రాష్ట్రం పాండిచ్చేరిలో జాతీయస్థాయి పోటీలు
★ దాతలు సహాయం చేస్తేనే జాతీయ పోటీలకు
★ వెక్కిరిస్తున్న కడు పేదరికం
★ఆర్ధిక సహాయం చెయ్యండి
★ జిల్లాకు మండలానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తా
పినపాక కు చెందిన ఆదివాసీ యువకుడు దబ్బగట్ల లోకేశ్ వేడుకోలు
#పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పినపాక కు చెందిన ఆదివాసి యువకుడు దబ్బ గట్ల లోకేష్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని స్పోర్ట్స్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న లోకేష్ అథ్లెటిక్స్ లో రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో హనుమకొండ హైదరాబాదు, జార్ఖండ్ పట్టణాలలో నిర్వహించిన అండర్ 14 ఈ గ్రూపు విభాగంలో అత్యున్నత ప్రతిభ కనబరిచారు. ఆయా విభాగాలలో రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచినట్లు యువకుడు లోకేష్ తెలిపారు. ఈ క్రమంలోనే జాతీయ పోటీలకు ఎంపిక కావడం జరిగిందన్నారు. మరో రెండు రోజులలో తమిళనాడు రాష్ట్రం పాండిచ్చేరిలో నిర్వహించే జాతీయస్థాయి పోటీలలో ఆ యువకుడు పాల్గొనాల్సింది. కడు పేదరికంలో ఆ యువకుని కుటుంబం ఉండడంతో… లోకేష్ ఆ పోటీలలో పాల్గొనడం కష్టంగా మారింది .దాతల సహాయం కోరారు. తనకు దాతలు ఆర్థిక సాయం అందించి జాతీయస్థాయి పోటీలకు పంపించాలని వేడుకున్నారు. జాతీయస్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాక, పినపాక కు పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తానన్నారు. సహాయం చేయాల్సిన దాతలు ఈ నెంబర్లో సంప్రదించాలని కోరారు. 95421 23597









