+91 95819 05907

నిండుకుండలా వైరా రిజర్వాయర్… త్రాగు నీటికి అల్లాడుతున్న ప్రజలు..

సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్

సిపిఐ(ఎం) ఆద్వర్యంలో మున్సిపాలిటీ వద్ద నిరసన

నేటి గదర్ న్యూస్, వైరా:
శివుడి శిరస్సుపై ఉన్న గంగలాగ వైరా శిరస్సుపై ఉన్న వైరా రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టంతో నిండుకుండలా ఉన్నప్పటికీ, వైరా పట్టణంలోని ప్రజలు త్రాగు నీటికి అల్లాడుతున్నారని సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్ విమర్శించారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి ప్రాంతంలో గత పది రోజులుగా పంపు నీరు రాకపోవడంతో బుధవారం సిపిఐ(ఎం) వైరా బ్రాహ్మణపల్లి శాఖ ఆధ్వర్యంలో ప్రజలు స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద పంపు నీటిని విడుదల చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్ మాట్లాడుతూ 25 వేల ఎకరాలకు సాగునీరు, ఏడు మండలాల ప్రజలకు త్రాగునీరు అందిస్తున్న వైరా రిజర్వాయర్ నిండుకుండలా ఉన్నప్పటికీ వైరా పట్టణ ప్రజలకు త్రాగునీటి కష్టాలు తీరటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.గత పది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఒకవైపు రహదారులపై పంట కాలువలు మాదిరిగా డ్రైనేజీ మురుగు నీరు పారుతుందని, మరొకవైపు పంపుల్లో చుక్క నీరు రాక ప్రజలు త్రాగటానికి, కుటుంబ అవసరాలకు మంచినీరు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వెంటనే పంపు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ(ఎం) నిరసనకు స్పందించిన మున్సిపాలిటీ కమిషనర్ చింతా వేణు సాయంత్రం నుంచి పంపు నీటిని విడుదల చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, నాయకులు కొంగర సుధాకర్, పైడిపల్లి సాంబశివరావు, యనమద్ది రామకృష్ణ, చావా కళావతి, చిత్తోజు స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !