+91 95819 05907

గ్రామ పంచాయతీ లలో పారిశుధ్య లోపం ప్రబలుతున్న వ్యాధులు పట్టించుకోని అధికారులు: నున్నా.

నేటి గదర్ న్యూస్, వైరా/కొణిజర్ల:

నేడు కొనిజర్ల మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) మండల జనరల్ బాడీ సమావేశం కామ్రేడ్ చింతపల్లి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో స్పెషలాఫీసర్ల పరిపాలనలో గ్రామపంచాయతీలు చెత్తకుప్పలుగా మారాయి. ఇటీవల కాలంలో కురిసినటువంటి అధిక వర్షాలు వలన దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదు. గ్రామపంచాయతీ కార్యాలయాల్లో నిధులు లేవనేటటువంటి నెపంతో గ్రామాల్లో వీధిలైట్లు వేయించడం గాని డ్రైనేజీలు శుభ్రపరచడం గాని బ్లీచింగ్ చల్లడం గానీ దోమల నియంత్రణ కొరకు పాగింగ్ చేయడం గాని కనీసమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. కొనిజర్ల మండలంలో డెంగ్యూ వ్యాధి లక్షణాలతో సుమారు ఇప్పటికే ఐదుగురు చనిపోవడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తమై గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుపరిచే దాని కొరకు విస్తృతమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేస్తున్న అని అన్నారు. అంతేకాదు గత పదిహేను రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలకు పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా పెసర,పత్తి పంటలు తీవ్రంగా నష్టపోయాయి భూమిలో ఉన్నటువంటి నత్రజని అధిక వర్షాల వల్ల కొట్టుకుపోయి పంటలు వెలవెల బోతున్న సందర్భంలో రైతులు యూరియా బస్తాల కోసం సొసైటీల ముందు రోజులు తరబడి కాపలాకాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యల పట్ల తక్షణమే అధికారులు స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ పార్టీ మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు సీనియర్ నాయకులు కొప్పుల కృష్ణయ్య, బోయినపల్లి శ్రీనివాసరావు, మోత్కూరు వెంకటేశ్వరరావు, జోనబోయిన అంజయ్య తాళ్లపల్లి విజయ పగిడిపల్లి కాటయ్య భానోత్ హరిచంద్ పుల్లూరి వెంకటేశ్వర్లు, తేజావత్ సీతారాములు,షేక్ అఫ్జల్ ధారగాని రాములు, నాగేశ్వరరావు,మైబూబ్ అలీ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !