+91 95819 05907

పినపాక యువకుడికి అండగా నిలిచిన కుంజ సూర్యరామ్(సూర్య భాయ్)★ఆ యువ క్రీడాకారుని ధీన గాథను నేటి గదర్ వెబ్ న్యూస్ లో ప్రచురించిన విషయం విధితమే.🙏🙏🙏

ఆదివాసీ యువ క్రీడా కారునికి ఆర్ధిక సహాయం అందజేసి అండగా నిలిచిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య రామ్

★ జాతీయ స్థాయికి ఎంపికైన ఆదివాసి యువకుడు దొబ్బగట్ల లోకేష్
★ ఆర్థిక సాయం కోసం దాతలను వేడుకున్న లోకేష్
★ తక్షణమే స్పందించిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య రామ్
★రూ.10వేల ఆర్థిక సాయం అందజేత
★ జాతీయస్థాయిలో రాణిస్తే అన్ని విధాల అండగా ఉంటా
★కుంజా సూర్య రామ్
★ ఆ యువ క్రీడాకారుని ధీన గాథను నేటి గదర్ వెబ్ న్యూస్ లో ప్రచురించిన విషయం విధితమే

నేటి గదర్ న్యూస్,పినపాక:ఆ ఆదివాసి విద్యార్థి ని కడు పేదరికం వెక్కిరిస్తుంది… తన ఇంట్లో పుట్టడి కష్టాలు… అయినా తన లక్ష్యం వీడలేదు… మారుమూల ఏజెన్సీ గ్రామం నుంచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు ఆ యువకుడు. కానీ దారి ఖర్చులు లేక దాతలను వేడుకున్నాడు. ప్రజా సేవలో ముందుండే కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య రామ్ నేనున్నానంటూ ముందుకు వచ్చి ఆ యువకుని అండగాలించారు.రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయం తన యువ సైన్యం ద్వారా అందజేశారు. వివరాలు…కడు పేదరికంలో ఉన్నప్పటికీ క్రీడల్లో రాణిస్తూ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలానికి చెందిన ఆదివాసీ యువకుడు దబ్బగట్ల లోకేష్‌కు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కుంజ సూర్యరామ్ అండగా నిలిచారు. పాండిచ్చేరిలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు హాజరు కావడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న లోకేష్‌కి సూర్యరామ్ ₹10,000 ఆర్థిక సాయం అందించినారు.
కిన్నెరసాని స్పోర్ట్స్ పాఠశాలలో అథ్లెటిక్స్‌లో శిక్షణ పొందుతున్న లోకేష్ అండర్-14 విభాగంలో తన సత్తా చాటాడు. హనుమకొండ, జార్ఖండ్‌లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండో స్థానంలో నిలిచాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కానీ, పేదరికం కారణంగా జాతీయస్థాయిలో తెలంగాణకు పేరు తీసుకురావాలన్న తన కల ఆగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, మంత్రి సీతక్క తనయుడు కుంజ సూర్యరామ్ వెంటనే స్పందించి లోకేష్‌కి ఆర్థిక సాయం అందించారు. క్రీడాకారులకు ప్రోత్సాహం అందించడంలో తమ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని సూర్యరామ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. లోకేష్‌ను ఇతర క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవాలని, జాతీయ స్థాయిలో విజయం సాధించి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. సకాలంలో సాయం అందించిన సూర్యరామ్‌కు లోకేష్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయంతో లోకేష్ ఇప్పుడు ధైర్యంగా జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడానికి సిద్ధమయ్యాడు.ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోడిశాల రామనాధం,సూర్యన్న టీం సభ్యులు పినపాక పట్టి నగర్ సతీష్, భాను,పొనుగోటి చందర్రావు, అచ్చా నవీన్, జరుపుల రాము నాయక్, కోడిరెక్కల సాయి కుమార్, కల్తీ ప్రభాకర్, అత్తె లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.ఆ యువ క్రీడాకారుని ధీన గాథను నేటి గదర్ వెబ్ న్యూస్ లో ప్రచురించిన విషయం విధితమే.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !