నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
చింతకాని మండల పరిధిలో గ్రామాల్లో గణేష్ మండపాలను ఏర్పాటు చేయాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా పొందాలని ఎస్.ఐ నాగుల్ మీరా స్పష్టం చేశారు.మండపం ఏర్పాటు చేసే స్థలదాత అంగీకార పత్రం,విద్యుత్ శాఖ అనుమతి పత్రాలు తప్పనిసరిగా పోలీస్ శాఖకు సమర్పించాలన్నారు. వినాయక మండపాల వద్ద డిజె సౌండ్ కు అనుమతి లేదని,ప్రజలంతా నియమ నిబంధనలను గౌరవిస్తూ పోలీస్ శాఖను సంప్రదించి మాత్రమే మండపాలు ఏర్పాటు చేయాలని ఎస్. ఐ నాగుల్ మీరా కోరారు. చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Post Views: 95









