క్రీడా ప్రాంగణం అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మెచ్చా హామీ
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, ఆగస్టు, 22: దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం గ్రామంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ క్రీడా ప్రాంగణంలో దమ్మపేట మండల ఫోటో మరియు విడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి ఫోటో గ్రాఫర్ల క్రికెట్ టోర్నమెంట్ లో నిర్వాహకుల ఆహ్వానం మేరకు శుక్రవారం అశ్వారావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని, టాస్ వేశారు అనంతరం క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన మొక్కలను క్రీడా ప్రాంగణంలో నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దమ్మపేట మండల ఫోటో మరియు వీడియో గ్రాఫర్ల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయమని, క్రీడల వల్ల అనేక లాభాలు ఉన్నాయని, రాజకీయాలలో, క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, గెలిచినా ఓడినా ప్రయత్నాన్ని మాత్రం ఆపకూడదని, గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి పంచాయతీలో క్రీడా మైదానాలు ఉండాలనీ ఆ నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం వల్లనే నేడు మనం ఇంత ప్రశాంతకరమైన వాతావరణంలో అద్భుతమైన క్రీడాప్రంగణంలో క్రీడా పోటీలు నిర్వహించుకోగలుతున్నామని స్థానికులు ఇంకా ఈ క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని కోరారని, తప్పకుండా మూడు సంవత్సరాలు తరువాత మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని వచ్చాక ఈ క్రీడా ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు దారా యుగంధర్, మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, అంకత ఉమా మహేశ్వరరావు, రావుల శ్రీను, జలగం వాసు, మహిళా నాయకురాలు యాట్ల వెంకమ్మ, అబ్దుల్ జిన్నా, రావూరి వీరయ్య, దారా రాము తదితరులు ఉన్నారు.









