పల్లెల అభివృద్ధి నే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం
– పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు
– సీతారాంపురం గ్రామసభకు హాజరైన జిల్లా కలెక్టర్
పినపాక
పల్లెల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.శుక్రవారం పనుల జాతరలో భాగంగా పినపాక మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నూతన అంగన్వాడి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ జితేశ్. వి. పాటిల్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతారాంపురం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం లోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతామన్నారు.నియోజవర్గ అభివృద్ధి, పల్లెల్లో మౌలిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. గ్రామాలలో అంతర్గత రహదారులు, తాగునీరు, సాగునీటి వనరుల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. విద్య, వైద్య సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. పేదల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేసిందని స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ గ్రామసభల్లో మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీలు, ఏపీవోలు, పీఆర్ ఇంజినీరింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొని గ్రామ సభల్లో గతేడాది చేపట్టిన జీపీ, అంగన్వాడీ భవనాలు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం, ఉద్యానవనాలు, సోక్ పిట్స్, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్, సిగ్రిగేషన్ షెడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు, పశువుల కొట్టాలు, కోళ్ల షెడ్లు తదితర పనుల వివరాలతోపాటు ఆయా పనులు చేపట్టడం ద్వారా గ్రామంలోని ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో అత్యధిక రోజులు పని చేసిన కూలీలను, దివ్యాంగ కూలీలను, మల్టీపర్పస్ వర్కర్లను సన్మానించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సహాయ అధికారి తాతారావు,తహసీల్దార్ గోపాల కృష్ణ, ఎంపీడీవో సునీల్ కుమార్, ఎంపీఓ వెంకటేశ్వరరావు, ఎంఈఓ నాగయ్య, మణుగూరు తాసిల్దార్ అద్దంకి నరేష్ ,వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు









