+91 95819 05907

నిరుపేదల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఒక్కటే మార్గం: సీఎం రేవంత్ రెడ్డి

నిరుపేదల భవిష్యత్తు బాగుండాలంటే చదువు ఒక్కటే మార్గమని, వారి చదువుల కోసం ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు మరోసారి స్పష్టం చేశారు. పేదలకు చదువు చెప్పించి సమాజంలో ప్రయోజకులను చేయాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు.

❇️భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి @INC_Ponguleti గారు, వాకిటి శ్రీహరి గారితో కలిసి పాల్గొన్నారు. అనంతరం దామరచర్లలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు.

❇️“నిరుపేదలకు పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు అందుబాటులో లేవు. పేదవాడి బాధలు తీరాలంటే చదువు కోవడం ఒక్కటే మార్గం. చదువు చెప్పించి మిమ్మల్ని ప్రయోజకులను చేయాలన్న సంకల్పంతోనే వంద నియోజకవర్గాల్లో ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తున్నాం. హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచాం.

❇️స్థానికంగా ఉపాధి అవకాశాలను మెరుగు పరచడంతో పాటు సింగపూర్, దక్షిణ కొరియా, జపాన్ లాంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఐటీఐలన్నింటినీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చాం. పేదవారి బతుకులు బాగుపడాలంటే, పేదవాడు పరిపాలన చేయాలంటే, ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లు కావాలంటే చదువొక్కటే మార్గం. చదువుకోండి. అందుకు ఏం కావాలో అడగండి. ఎవరో సాయం చేయాలని ఎదురుచూసే స్థాయి నుంచి పేదవాడు నలుగురికి సాయం చేసే స్థాయికి ఎదగాలి.

❇️రాష్ట్రంలో ఏ చిన్న తప్పిదం జరక్కుండా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్నాం. మంత్రి పొంగులేటి గారు తనకు అప్పగించిన శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తూ మొదటి విడతలో 4.5 లక్షల నిరుపేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చుతున్నారు.

❇️గ్రామాల్లో పేదరికాన్ని చూశాం. గ్రామ స్థాయి నుంచి ఈరోజు జాతీయ స్థాయి రాజకీయాలు మాట్లాడుతున్నామంటే.. పేదరికమంటే ఎలా ఉంటుందో చూశాం కాబట్టే మాట్లాడగలుగుతున్నాం. గ్రామాల్లోనే పుట్టాం. అక్కడే పేదలతో కలిసి భోజనాలు చేశాం. అది మా జీవన విధానంలో ఒక భాగం. అందుకే పేదరికాన్ని రూపుమాపాలని ఒక బాధ్యతగా తీసుకుని పనిచేస్తున్నాం.

❇️ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆనాడు పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశాం. వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఉచిత కరెంట్, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ ఇచ్చాం.

❇️ప్రజలు రేషన్ కార్డుల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఇప్పుడు ఇందిరమ్మ ప్రభుత్వం రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, సన్న బియ్యం ఇస్తున్నాం. మా ఇళ్లల్లో ఏ సన్నబియ్యం తింటున్నామో పేదోడి ఇంట్లో కూడా అదే సన్నబియ్యం తింటున్నారు. ఈ సంక్షేమ పథకాలన్నీ ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సాధ్యమైంది” అని వివరించారు.

❇️ఈ కార్యక్రమంలో ఎంపీలు @porika_balram గారు, @MP_KHAMMAM_RRR గారితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన శాసనసభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !