వినాయకుడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న .సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ కే.నాగుల మీరా
అన్న సమర్పణ ప్రాంభించిన ఎస్ ఐ నాగుల మీరా
నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
చింతకాని మండల కేంద్రం చింతకాని-కొణిజర్ల రోడ్ లోని పెద్ద బావి బజారు లో బుధవారం నాడు గణేశ్ నవరాత్రి ఉత్సవాలలో చింతకాని సబ్ ఇన్స్పెక్టర్ షేక్ నాగుల్ మీరా పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నాగుల్ మీరా మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు మడుపల్లి భాస్కర్ తో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తూము భిక్షం,చెన్నకేశవ స్వామి టెంపుల్ ఛైర్మెన్ యండపల్లి శ్రీనివాసరావు,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు అబ్దుల్ మజీద్,సీపీఎం నాయకులు దేశబోయిన ఉపేందర్,పెద్దగౌండ్ల వెంకటనారాయణ,కొమ్మిని రామారావు,చింతకాని మాజీ సర్పంచ్ బండి సుభద్ర తీరపయ్య,తిపట్ల జనార్దన్ మరియు పెద్ద సంఖ్యలో మహిళలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.









