+91 95819 05907

భారీ వర్షాలకు నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలి: టీడీపీ డిమాండ్.

చింతకాని మండలం లో పర్యటించిన డా.రామనాథం.

నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి:

చింతకాని మండలం లచ్చగూడెం మరియు నేరడ గ్రామాల్లో పత్తి మరియు పెసర పూర్తిగా దెబ్బతిన్న పంటలను చింతకాని మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పంట పొలాలను పరిశీలించారు.ఈ సందర్భంగా టిడిపి పార్లమెంటరీ పార్టీ అడ హగ్ కమిటీ కన్వీనర్ వాసిరెడ్డి రామనాథం మాట్లాడుతూ తుఫాన్లు భారీ వర్షాలకు కారణంగా జిల్లాలో పత్తి పెసర వేసిన రైతులు దారుణంగా దెబ్బతిన్నారని,కోతకు వచ్చిన పెసర పూర్తిగా దెబ్బ తిని రైతుకు దక్కకుండా అయినదని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మరియు వ్యవసాయ అధికారులు సర్వే చేసి రైతాంగానికి నష్టపరిహారం అందించాలని కోరారు. తదనంతరం చింతకాని మండల వ్యవసాయ అధికారి మానస కి పంట నష్టం గురించి వివరించి తక్షణమే పంటల నష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేసే విధంగా కోరారు. జిల్లా నాయకులు మందడపు సుధాకర్ మాట్లాడుతూ నష్టపోయిన పెసర పంటను మార్క్ ఫైడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని అలాగే దెబ్బతిన్న పెసర పంటకు ఎకరాకు 15000 రూపాయలు అలాగే పత్తి పంటకు 20 వేల రూపాయలు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని అలాగే పంట బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారా సహాయం అందే విధంగా చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే నష్టపోయిన బాధిత రైతులను కౌలు రైతుల సమస్యలను వినడం జరిగినది అనంతరము పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని చింతకాని తాసిల్దార్ కి అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు తేలుకుంట్ల శ్రీనివాసరావు,బోనకల్ మండల టిడిపి అధ్యక్షులు రావుట్ల సత్యనారాయణ,చింతకాని మండల టిడిపిమాజీ అధ్యక్షులు నున్న తాజుద్దీన్,ఉపాధ్యక్షులు,నన్నక రామారావు,మండల రైతు నాయకులు పెంట్యాల రామారావు, సీనియర్ నాయకులు నన్నక గోపాలరావు,గంట సత్యనారాయణ గురజాల మాధవ,తాళ్లూరు శేషయ్య ,తాళ్లూరి రాము, ముప్పాళ్ళ కోటయ్య,దాసరి లక్ష్మీ, నరసయ్య కిషోర్ చౌదరి పగిడిపల్లి పానకాలు ఏసు,పోగు రాంబాబు ముప్పాళ్ళ కోటయ్య, కొనకంచి లక్ష్మీనారాయణ, సురేషు,మల్లెల సత్యనారయణ, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !