అశ్వారావుపేటలో రోడ్డు, డ్రైనేజీ పనుల పరిశీలన
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 4: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గురువారం మండల కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న సెంటర్ లైటింగ్, రోడ్డు వైండింగ్, డ్రైనేజీ పనులను ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం, ఎమ్మెల్యే పేరాయిగూడెం గ్రామానికి వెళ్ళి, అనారోగ్యంతో మరణించిన మాజీ సర్పంచ్ నార్లపాటి సత్యావతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 54









