సీఎం రేవంత్ రెడ్డి ఆప్యాయతకు గిరిజనుల కృతజ్ఞతలు
దామరచర్ల పర్యటనలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణపై ప్రేమ చూపిన సీఎం
నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 4: ఇటీవల దామరచర్ల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక గిరిజన ఎమ్మెల్యే జారె ఆదినారాయణపై చూపించిన ఆప్యాయత గ్రామీణ ప్రజల మనసులను గెలుచుకుందని అశ్వారావుపేట గిరిజన సమాజం పేర్కొంది. అన్ని వర్గాలతో పాటు గిరిజనులపై సమాన దృష్టి, గౌరవం, ప్రేమను చూపిస్తున్న ముఖ్యమంత్రికి అశ్వారావుపేట గిరిజన సమాజంతో పాటు అన్ని వర్గాల ప్రజల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనులను కూడా సమానంగా చూసే ముఖ్యమంత్రి మంచితనం తమకు ధైర్యాన్నిచ్చిందని, తమలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందించిందని చెప్పారు. అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి నిబద్ధతతో పని చేస్తున్న తమ ఎమ్మెల్యే జారె ఆదినారాయణకు సీఎం ఎప్పుడూ అండగా నిలవాలని ఈ సందర్భంగా గిరిజన నాయకులు ఆకాంక్షించారు.









