దమ్మపేటలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మెచ్చా
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, సెప్టెంబర్, 04: అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు గురువారం దమ్మపేట మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. మండలంలోని చిన్నగొల్లగూడెం గ్రామంలో గుర్రం నరసింహరావు కుమార్తెల ఓణీల వేడుకకు హాజరై, వారిని ఆశీర్వదించారు. అనంతరం స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు. తర్వాత పెద్దగొల్లగూడెం గ్రామంలో విఘ్నేశ్వర యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సందర్శించి, స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడ జరిగిన అన్నసమారాధన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో రావుల శ్రీను, జలగం వాసు, అబ్దుల్ జిన్నా, పాకనాటి శ్రీను, పాశం ప్రసాద్, దారా రాము, కందుకూరు రాంబాబు, మహాలక్ష్ముడు, మచ్చల శ్రీను, వెంకటేష్, వెంకటరామయ్య, కవులూరి వినోద్, వరకుటి గణేష్, కిట్టు, విశ్వనాధం, అశోక్, రాంబాబు, రవి తదితరులు పాల్గొన్నారు.









