నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
ఖమ్మం జిల్లా చింతకాని మండలం మండల పరిధిలో చింతకాని రైతు వేదిక లో మండల విద్యాశాఖ అధికారి సలాది రామారావు ఆధ్వర్యంలో ఘనంగా విద్యా వనరుల పూజోత్సవ వేడుకలు ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో ఉత్తమ పనితీరును ప్రదర్శించి
ప్రధానోపాధ్యాయుల విభాగం నుండి సిహెచ్ శ్రీనివాసరావు, హెచ్ఎం జెడ్పిహెచ్ఎస్ కోదు మూరు పాఠశాల సహాయకుడు విభాగం నుండి పొత్తూరు సీతారామారావు, తెలుగు జెడ్పిహెచ్ఎస్ చింతకాని ఎస్ జి టి భాగంగా శ్రీమతి లక్ష్మీ, పందిళ్ళపల్లి ప్రాథమిక పాఠశాల నుండి మరియు సిహెచ్ వాసు శ్రీమతి వనజ, ఎస్ జి టి మరియు కేజీబీవీ నుండి మౌనిక ను శాలువాతో ఘనంగా సత్కరించారు. తధానంతరం మండల విద్యాశాఖ అధికారి రామారావు మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణన్ సేవలను కొనియాడుతూ
సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శంగా ఉపాధ్యాయులు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయ సంఘ బాధ్యులు, డిఆర్పీలు,తదితరులు పాల్గొన్నారు.









