+91 95819 05907

కేటిఆర్ పర్యటను విజయవంతం చేయాలి :రేగా

*స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి*
*బీఆర్ఎస్ పార్టీ అభ్యుర్థులను గెలిపించాలి*
*కార్యకర్తలకు అండగా నేను ఉంటా*
*పలువురు కాంగ్రెసు నాయకులు బీఆర్ఎస్ లో చేరిక*
*బిఅర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు*
నేటి గదర్ కరకగూడెం:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని,సెప్టెంబర్ 10,11 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పర్యటను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గురువారం కరకగూడెం మండలంలోని స్పందన గార్డెన్ నందు కరకగూడెం,ఆళ్లపల్లి,
గుండాల మూడు మండలాల స్థాయి బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో ముఖ్యాతిథిగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు హజరై,మాట్లాడుతూ ఆరు హామీలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని,ప్రజలను గాలికి వదిలేసారని ఆవేదం వ్యక్తం చేశారు.ఇందిరమ్మ ఇల్లు పేర్లతో ప్రజలను ఆశ పెడుతున్నారని,ప్రజలు ఎవరు కూడా నమ్మి మోసపోద్దని,ఎన్నికల కోసమే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నాటకాలని అన్నారు.రైతుల పండించే పంటలకు సకాలంలో ఎరువులు కూడా ఇవ్వకుండా నాయకులు ఈ ప్రభుత్వం కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు.కేసిఆర్ ప్రభుత్వంలో రైతులను కళ్ళల్లో పెట్టి చూసుకున్నారని సూచించారు.ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ తమ రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి,సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తూ,స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు,జడ్పీటీసి,ఎంపీటీసీ స్థానాలను బీఆర్ఎస్ అభ్యర్ధులే పూర్తి స్థాయిలో గెలుపొందేలా పార్టీ నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు. అనంతరం కరకగూడెం,ఆళ్లపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీని వీడి జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మూడు మండలాల పార్టీ అధ్యక్షులు,మాజీ ఎంపీపీలు,మాజీ జెడ్పిటిసిలు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు,సొసైటీ అధ్యక్షులు,సొసైటీ డైరెక్టర్లు,అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మెదక్ జిల్లాలో శిశు విక్రయం

రూ.1.7 లక్షలకు కన్న కొడుకును అమ్ముకున్న తల్లిదండ్రులు మెదక్ జిల్లా హవేలీఘనాపూర్ మండలం లింగసానిపల్లి తండాలో గత నెల 10వ తేదీన మగశిశువుకు జన్మనిచ్చిన ఓ గిరిజన మహిళ అంగన్వాడీ కేంద్రం నుండి గుడ్లు,

Read More »

రూ.66 లక్షల ఇన్సూరెన్స్ కోసం భర్త ను కారుతో గుద్దించి హత్య చేసిన భార్య

ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం

Read More »

మధ్యాహ్నం భోజనం పరిశీలన చేసిన కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ

*మధ్యాహ్నం భోజనం పరిశీలన చేస్తున్న కలెక్టర్.* *కస్తూర్బా పాఠశాలలో రికార్డుల తనిఖీ…* బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల కస్తూర్బా బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి,రికార్డులు పరిశీలిన చేసి,అనంతరం మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి,విద్యార్థులకు

Read More »

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్ కొత్త యాకన్న ★ ఉత్తమ పంచాయతీగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం: సర్పంచ్ కొత్త యాకన్న

ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ పనులకు భూమి పూజ దంతాలపల్లి: దంతాలపల్లి మండలం ఆగపేట గ్రామంలో బతుకమ్మ ఘాట్ నిర్మాణ పనులకు సర్పంచ్ కొత్త యాకన్న గ్రామ పెద్దల సమక్షంలో మంగళవారం పూజలు నిర్వహించి

Read More »

ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలిస్తే సహించేది లేదు

*జాతీయ ట్రైబల్ ఫోరం కన్వీనర్ ముక్తి సత్యం* *నేటి గదర్ న్యూస్ గుండాల*, వైల్డ్ యాక్ట్ పేరుతో ఆదివాసి గుంపులను మైదాన ప్రాంతాలకు తరలించాలని చేస్తున్న కుట్రలను తక్షణమే విరమించుకోవాలని ఆదివాసి ట్రైబల్ ఫోరం

Read More »

ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలి* *యుటిఎఫ్ కార్యదర్శి రూప్ సింగ్

*నేటి గదర్ న్యూస్ గుండాల*ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి ఎల్,రూప్ సింగ్ డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు కేజీబీవీ, యు ఆర్ ఎస్, ఎస్ ఎస్

Read More »

 Don't Miss this News !