+91 95819 05907

దమ్మపేటలో యూరియా కొరత -రైతుల ఆందోళన

సొసైటీ వైస్ ప్రెసిడెంట్ కట్టం ఎర్రప్ప ప్రభుత్వాన్ని తక్షణమే స్పందించాలని డిమాండ్.

నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, సెప్టెంబర్, 5: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలో రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్పందించిన దమ్మపేట సొసైటీ వైస్ ప్రెసిడెంట్ (తెలుగుదేశం పార్టీ) కట్టం ఎర్రప్ప ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి ఆవేదన చెందిన ఎర్రప్ప, రైతులు దేశానికి వెన్నుముక అని, వారి కంటతడి పెట్టడం ప్రభుత్వానికి తగదని అన్నారు. సొసైటీకి చాలా తక్కువ మొత్తంలో యూరియా సరఫరా చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎజెన్సీ ప్రాంతమైన దమ్మపేటలో ఎక్కువ మంది రైతులు ఉన్నప్పటికీ, వారికి ఒక బస్తా యూరియాతో సరిపెట్టుకోమని చెప్పడం హేయమైన చర్య అని విమర్శించారు. రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించిన ఎర్రప్ప, అధికారులు సైతం ఈ పరిస్థితిలో ప్రజల నమ్మకాన్ని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తక్షణమే స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చొరవ తీసుకుని, తన సొంత మండలమైన దమ్మపేట రైతుల కోసం యూరియాను మరింత దిగుమతి చేయించి సమస్యను పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !