జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అధికారికంగా ప్రకటన
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, సెప్టెంబర్, 5: భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు రేగా కాంతారావు, పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా దమ్మపేట మండల కన్వీనరుగా దొడ్డ రమేష్‌ను నియమించారు. మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేసేందుకు ఈ నియామకాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయి ముఖ్య నాయకులతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించినట్లు రేగా కాంతారావు పేర్కొన్నారు. ప్రజలతో, కార్యకర్తలతో మంచి సంబంధాలున్న నాయకులను గుర్తించి, ఏకాభిప్రాయంతో మండల బాధ్యులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. దొడ్డ రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనందున ఆయనను జిల్లా పార్టీ తరపున అభినందించారు. ఈ క్షణం నుంచి బాధ్యతలు చేపట్టి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన సూచించారు.
Post Views: 175









