పినపాక, సెప్టెంబర్ 06:
పినపాక మండలంలోని పినపాక జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టు డే సందర్భంగా.
మానవతా దృక్పథంతో *పినపాక జర్నలిస్టుల సంఘం* మరోసారి తమ సేవా కార్యక్రమంతో చాటుకుంది. మండలంలోని పినపాక గ్రామానికి చెందిన కొండ్రు వీరయ్య, w/o సుశీల.
ప్రధానుడు ఆకస్మికంగా కన్నుమూసిన నేపథ్యంలో ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని గమనించిన పినపాక జర్నలిస్టుల సంఘం ప్రతినిధులు ముందుకు వచ్చి సహాయం అందించారు.
సంఘం ఆధ్వర్యంలో మృతుని కుటుంబానికి 25 కేజీల బియ్యం వితరణ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన జర్నలిస్టులు, సంఘం ఎల్లప్పుడూ ప్రజల పక్కనే ఉంటుందని, అవసరమైన చోట సహాయం చేసేందుకు ముందుంటుందని హామీ ఇచ్చారు. బాధలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పడమే కాకుండా భవిష్యత్తులో కూడా తగినంత సహకారం అందిస్తామని పేర్కొన్నారు.
సంఘం నాయకులు మాట్లాడుతూ – “జర్నలిస్టు అంటే కేవలం వార్తలు రాయడమే కాదు, సమాజానికి అవసరమైన సందర్భంలో అండగా నిలబడటమూ బాధ్యతే” అని అభిప్రాయపడ్డారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టి, ప్రజల్లో మానవతా విలువలను పెంపొందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పినపాక జర్నలిస్టుల సంఘం గౌరవ సలహాదారు, యాగమాటి గంగాధర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు, కొత్త దామోదర్ గౌడ్ క్లబ్ అధ్యక్షులు సత్ర పల్లి సారయ్య, ఉపాధ్యక్షులు వాగబోయిన సాంబశివరావు, ప్రధాన కార్యదర్శి అత్తె లక్ష్మణ్, కోశాధికారి, కన్నె రమేష్ కమిటీ సభ్యులు, గోడిశాల చంద్రం, రాము గ్రామస్తులు పాల్గొని సహాయాన్ని అందించారు.









