నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పెసర. పత్తి రైతులు భారీగా నష్టపోయారు, నష్ట పోయిన పెసర రైతులను చిన్నమండవ గ్రామంలో శనివారం క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించిన ఏఈఓ కల్యాణి.పంట ఎంత మొత్తంలో నష్టం జరిగిందో వివరాలు అడిగి తెలుసుకొని నమోదు చేసుకుంన్నారు.రైతుల నుండి పంట నమోదుకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, పాస్ బుక్ జీరాక్స్ లు తప్పకుండా ఇచ్చి రైతులు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాగులవంచ సొసైటీ డైరెక్టర్ పర్చగాని లక్ష్మణ్, మొగిలి గోపయ్య, గుండ్ల మంగారావు, డోకుపర్తి కోటి మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 110









