నేటి గదర్ మెదక్ ప్రతినిధి(భూపాల్ మాదిగ) సెప్టెంబర్ 18.
మెదక్ జిల్లా మాసాయి పేట మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించిన మాసాయిపేట మండల తహసిల్దార్ జ్ఞాన జ్యోతి ఈ సందర్భంగా తహసిల్దార్ జ్ఞాన జ్యోతి మాట్లాడుతూ మనకు స్వతంత్రం 1947 లో వచ్చింది అది మనకు అందరికీ తెలిసిన విషయమే కానీ 1949 సెప్టెంబర్ 17 న ఎందరో మహానీయుల త్యాగఫలం రాచరికపు పాలన నుంచి విముక్తి పొంది భారత యూనియన్ వీలినమైన తెలంగాణ అందుకే సెప్టెంబర్ 17న శుభదినం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసుకుంటాం అని అన్నారు. తెలంగాణ వినియోచన దినోత్సవం గా సాయుధ పోరాటంలో తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారని వారిని స్మరించుకోవటం మన కర్తవ్యం అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండల ఆర్ ఐ ధన్ సింగ్, మండల తాసిల్దార్ సిబ్బంది మరియు గ్రామ కార్యదర్శి రాణి,పి ఎస్ ఎస్ సి డైరెక్టర్ ఉదండపురం నర్సింలు , మాజీ ఎంపీటీసీ చెరుకు సిద్ధిరాములు గౌడ్, మాజీ ఎంపీటీసీ కృష్ణ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ నాగిరెడ్డి, మాజీ సర్పంచ్ ఉదండపురం నాగరాజు, మటన్ పవన్, లక్ష్మణ్, మస్కుదు, శంకర్, కారోబార్ బిక్షపతి తదితరులు నాయకులు పాల్గొన్నారు. అనంతరం మాసాయిపేటలో నూతనంగా ప్రారంభించిన మాసాయిపేట మండల్ డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మాసాయిపేట తాసిల్దార్ జ్ఞాన జ్యోతిని మరియు ఆర్ఐ ధన్సింగ్ ను ఘనంగా సన్మానించిన మాసాయిపేట ప్రెస్ క్లబ్ సభ్యులు.









