+91 95819 05907

అశ్వారావుపేటలో ఆదివాసుల పంటల ధ్వంసం -ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఆదివాసి సేన ఆధ్వర్యంలో ఆదివారం ర్యాలీ, సివిల్ కేసుల్లో పోలీసులు జోక్యం చేసుకోవద్దని హెచ్చరిక.

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 20: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలం, వాగోడ్డు గూడెం గ్రామంలో ఫారెస్ట్ అధికారులు తమ పంటలను ధ్వంసం చేశారని ఆరోపిస్తూ బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివాసుల కష్టం పండిన చేతికి వచ్చిన పంటను రాత్రిపూట అధికారులు పీకివేయడం దుర్మార్గమైన చర్య అని ఆదివాసి సేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన అధికారులను తక్షణమే ఉద్యోగాల నుంచి తొలగించాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పంటలను ధ్వంసం చేయడం అనేది చట్టవిరుద్ధమని, వాస్తవ సాగులో ఉన్న భూముల్లోకి చొరబడకూడదని అనేక చట్టాలు ఉన్నప్పటికీ, ఫారెస్ట్ అధికారులు వాటిని పట్టించుకోవడం లేదని బాధితులు, ఆదివాసి సేన నాయకులు ఆరోపించారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే, ఆదివాసి సేన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. అనంతరం జరిగిన ఆదివాసి సేన సమావేశంలో, పోలీసులు సివిల్ వివాదాల్లో విచ్చలవిడిగా తల దూర్చడం రాజ్యాంగ విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోమని పోలీసుల్ని కూడా హెచ్చరించారు. ఈ సమస్యలపై అశ్వారావుపేట మండలంలో రేపు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆదివాసి సేన వెల్లడించింది. ఈ ర్యాలీకి ఆదివాసి సేన కార్యకర్తలు, ఆదివాసీలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో న్యాయవాది, ఆదివాసి సేన రాష్ట్ర సహాయ కార్యదర్శి ఊకే రవి అతిథిగా పాల్గొంటారని వారు తెలిపారు. సమస్యలు ఉన్నవారు తగిన సమాచారంతో ఈ ర్యాలీకి రావాలని, అలాగే ఆయా మండల బాధ్యులు, మహిళా కమిటీ సభ్యులు తప్పకుండా పాల్గొనాలని ఆదివాసి సేన కోరింది. ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన నాయకులు వగ్గల వెంకటేష్, సోందెం సుమన్ బాబు, కురసం బాబూరావు, కనితి వెంకటేష్, మహిళా నాయకురాళ్లు నేతి సోమమ్మ, కురుస సునీత, విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !