+91 95819 05907

మున్సిపాలిటీ సమస్యలపై సిపిఐ(ఎం) పోరుబాట

మున్సిపాలిటీ సమస్యలపై సిపిఐ(ఎం) పోరుబాట

100 కోట్ల నిధులు వేంటనే విడుదల చేయాలి.

సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ఉధృతం చేస్తాం.

సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం

వందలాది మంది ప్రజలతో మున్సిపాలిటీ వద్ద భారీ ధర్నా, వినతి

సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తాము

వైరా మున్సిపాలిటీ కమీషనర్ గురులింగం హామీ

నేటి గదర్ న్యూస్, వైరా:-
సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని ఎర్ర దండు పోరుబాట పట్టారు. సిపిఐ(ఎం) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డులలో చేసిన సర్వేలో ప్రజలు తెలిపిన పలు రకాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వైరా మున్సిపాలిటీ వద్ద వందల సంఖ్యలో ప్రజలు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం మాట్లాడుతూ వైరా మున్సిపాలిటీ ఎర్పడిన తర్వాత అన్ని రకాల పన్నులను పెంచి వసూలు చేస్తున్నారు. కానీ కనీస మౌలిక సదుపాయాలు కూడా అభివృద్ధి చెయ్యటం లేదని, ప్రధానమైన రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, పారిశుద్ద్యం, కనీసం శ్మశాన వాటికల లాంటి సమస్యలు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైరా మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించిన 100 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం వేంటనే విడుదల చేయాలని, అదికారులు వెంటనే స్పందించి వైరా మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రజలను సమీకరించి పోరాటాలు ఉధృతం చేస్తామని సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం హెచ్చరించారు. అనంతరం సర్వేలో గుర్తించిన సమస్యలు మధిర, తల్లాడ ఆర్ అండ్ బి రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించాలి, ఇందిరమ్మ కాలనీ వద్ద వాగుకు కరకట్ట నిర్మించాలి, పల్లిపాడు డబల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద శాశ్వత సైడ్ డ్రైనేజీ నిర్మించాలి, డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలి, సత్రం బజార్ రోడ్డుకు ఇరువైపుల డ్రైనేజీ నిర్మించాలి, కమ్యూనిటీ హాల్ నిర్మించాలి, గిరిజన భవన్, షాదిఖానా నిర్మాణం పూర్తి చేయాలి, హనుమాన్ బజార్ శ్మశాన వాటికకు రహదారి ఏర్పాటు చేయాలి, సోమవారంలో శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలి, గండగలపాడులో శ్మశాన వాటికను నిర్మించాలని, సొసైటీ వద్ద పార్క్ ఏర్పాటు చేయాలి, కరెంటు లైన్లు, మిడిల్ పోల్స్ ఏర్పాటు చేయాలి, పెండింగులో ఉన్న రేషన్ కార్డులు, వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు మంజూరు చేయాలని, ప్రధానమైన డ్రైనేజీలు, అంతర్గత రోడ్లు నిర్మించాలని, నివాస గృహాలు అన్నింటినీ అన్ లైన్ లో నమోదు చేయాలని తదితర సమస్యలను పరిష్కరించాలని మున్సిపాలిటీ కమిషనర్ గురులింగంకు వినతి పత్రాన్ని అందజేశారు. అదికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ప్రజలను సమీకరించి భారీ ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం కమీషనర్ గురులింగం స్పందిస్తూ తన పరిధిలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని, మిగిలిన సమస్యలను పై అదికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, సుంకర సుధాకర్, వైరా పట్టణ కార్యదర్శి చింతనిప్పు చలపతిరావు, కొణిజర్ల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు, డివిజన్ కమిటీ సభ్యులు మచ్చా మణి, తోట నాగేశ్వరావు, తూము సుధాకర్, నాయకులు గుడిమెట్ల రజిత, గుడిమెట్ల మోహన్ రావు, కొంగర సుధాకర్, పైడిపల్లి సాంబశివరావు, రాచభంటి భత్తిరన్న, బాజోజు రమణ, అనుమోలు రామారావు, కామినేని రవి, షేక్ నాగుల్ పాషా, మల్లెంపాటి రామారావు, సంక్రాంతి పురుషోత్తమరావు, ఓర్పు సీతారాములు, యనమద్ది రామకృష్ణ, భూక్యా విజయ, పారుపల్లి శ్రీనాథ్ బాబు, సంక్రాంతి చంద్రశేఖర్, షేక్ జమాల్ సాహేబ్, అమరనేని కృష్ణ, కురుగుంట్ల శ్రీనివాసరావు, కొత్త సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !