ప్రజల గుండెల్లో ఎమ్మెల్యే జారె,-నిధుల పంపిణీతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
నేటి గద్దర్ న్యూస్, చండ్రుగొండ, సెప్టెంబర్, 22: అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు. ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధిని చేకూరుస్తూనే, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా చండ్రుగొండ మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న చింతల వెంకటేశ్వర్లుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ. 2.50 లక్షల ఎల్ఓసి చెక్కును అందజేశారు. అనంతరం, మానసిక అంగవైకల్యం ఉన్న వికలాంగుల కోసం రూ. 28.50 లక్షల వ్యయంతో నిర్మించనున్న మూడు భవిత భవనాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ భవనాలు చండ్రుగొండ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట గ్రామ పాఠశాల, మరియు ములకలపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నిర్మించబడతాయి. అంతేకాకుండా, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి రైతువేదికలలో ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అన్నపురెడ్డిపల్లిలో రూ. 18 లక్షల 2 వేల 88 మరియు ములకలపల్లిలో రూ. 32 లక్షల 3 వేల 712 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అలాగే, అన్నపురెడ్డిపల్లిలోని సోషల్ వెల్ఫేర్ వసతిగృహం, ములకలపల్లి జూనియర్ కళాశాల, మరియు ములకలపల్లిలోని కేజీబీవీ పాఠశాలల్లో రూ. 40 లక్షలతో చేపట్టనున్న మరమ్మత్తులు, పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. కార్యక్రమాల అనంతరం, ములకలపల్లి మండలం కంపగూడెం గ్రామంలో గ్రామస్తుల కోరిక మేరకు బతుకమ్మ వేడుకలలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో మూడు మండలాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.









