నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, సెప్టెంబర్, 22: అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తన పర్యటనలో భాగంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఒక మహిళకు మానవత్వంతో సహాయం చేశారు. సోమవారం చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామం సమీపంలో ఆయన ప్రయాణిస్తుండగా, ద్విచక్రవాహనం అదుపుతప్పి ఒక మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటనను గమనించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, తన సొంత వాహనంలోనే ఆ మహిళను చండ్రుగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించిన అనంతరం, మెరుగైన వైద్యం కోసం ఆమెను కొత్తగూడెం ఆసుపత్రికి పంపించే వరకు అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ప్రాణాల కంటే విలువైనది ఏదీ లేదని, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడం మనందరి కర్తవ్యమని తెలిపారు.
Post Views: 63









