రాచూరుపల్లిలో జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ -క్రీడాకారులకు ఆహ్వానం, ఎంట్రీ ఫీజు రూ. 500/-
నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, సెప్టెంబర్, 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం రాచూరుపల్లి యూత్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం, పశ్చిమ గోదావరి జిల్లాల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. సెప్టెంబర్ 29, 2025 నుండి అక్టోబర్ 1, 2025 వరకు మూడు రోజుల పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, రాచూరుపల్లి గ్రామంలో జరిగే ఈ టోర్నమెంట్‌కు క్రీడాకారులతో పాటు క్రీడాభిమానులను కూడా ఆహ్వానిస్తున్నారు. టోర్నమెంట్‌లో పాల్గొనదలిచిన జట్లు రూ. 500/- ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఆకర్షణీయమైన బహుమతులు, ప్రముఖుల స్పాన్సర్‌షిప్ ఈ టోర్నమెంట్‌లో విజేతలకు ఆకర్షణీయమైన నగదు బహుమతులను అందజేయనున్నారు. ప్రథమ బహుమతి రూ. 25,116/-ను అశ్వారావుపేట శాసనసభ్యులు జారె ఆదినారాయణ, ద్వితీయ బహుమతి రూ. 20,116/-ను అశ్వారావుపేట మాజీ శాసనసభ్యులు తాటి వెంకటేశ్వర్లు, తృతీయ బహుమతి రూ. 15,116/-ను అశ్వారావుపేట మాజీ శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అందజేయనున్నారు. నాల్గవ బహుమతి రూ. 10,116/- దమ్మపేట మాజీ జెడ్.పి.టి.సి పైడి వెంకటేశ్వర్లు, ఐదవ బహుమతి రూ. 8,116/- బి.ఆర్.ఎస్ నియోజకవర్గ నాయకులు సోయం వీరభద్రం, ఆరవ బహుమతి రూ. 5,116/- లయన్స్ క్లబ్ అధ్యక్షులు అంకత ఉమా మహేశ్వరరావు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇతర స్పాన్సర్లు, మేనేజ్మెంట్ టీమ్కీ డ్రస్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సోయం మల్లిఖార్జునరావు, బెస్ట్ ప్లేయర్ ప్రైజ్‌కు దమ్మపేట సొసైటీ వైస్ చైర్మన్ కట్టం యర్రప్ప, ఆహార సదుపాయానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మొడియం శ్రీను, బాల్స్, నెట్‌కు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముళ్ళపూడి వెంకటేశ్వరరావు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. క్రీడాకారులకు భోజన సదుపాయం కూడా కల్పించనున్నారు. టోర్నమెంట్ నియమ నిబంధనలు:- మ్యాచ్‌లు సెప్టెంబర్ 29, 2025న ప్రారంభమవుతాయనీ, అన్ని జట్లు మొదటి రోజు నుండే హాజరు కావాలని, తరువాత వచ్చే జట్లకు ప్రవేశం ఉండదని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఒకే గ్రామ పంచాయతీ క్రీడాకారులు ఆ గ్రామ పంచాయతీ జట్టు తరపున మాత్రమే ఆడాలనీ, క్రీడాకారులకు ఆధార్ కార్డు తప్పనిసరి అని కమిటీ నిర్ణయమే అంతిమం అని జట్లు తమ పేర్లను సెప్టెంబర్ 27వ తేదీలోపు నమోదు చేసుకోవాలనీ, మరిన్ని వివరాలకు సంప్రదించాలని టోర్నమెంట్ వివరాల కోసం చిరు (8897260214), సాగర్ (7893205286), ముత్తు (9398038779) తో పాటు భాస్కర్, శ్రీను, నర్సింహ, అరుణ్, కె.వి. స్వామి, బాలు, హేమంత్, మోహన్, చందు తదితరులను సంప్రదించాలని నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు.









