+91 95819 05907

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.

ప్రతి రైతుకి యూరియా కొరత లేకుండా చూడాలి.

భారీ వర్షాలకు నష్టపోయిన పత్తి పెసర రైతులను ఆదుకోవాలి.

ఇందిరమ్మ కమిటీలు రద్దు చేయాలి.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు: పోతునేని, నున్న.

నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:

అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు పంపిణీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శ వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిధిలో పాతర్లపాడు గ్రామం నుండి చింతకాని మండల కేంద్రం వరకు ప్రజా సమస్యల పరిష్కరించేందుకు పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రకు సిపిఎం సీనియర్ నాయకులు కొండ్రు జానకి రామయ్య జండా ఊపి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రావు నున్న నాగేశ్వరరావు లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు గాని నిరుపేదలు గాని అనేక విధాలుగా నష్టపోతున్నారని నిజమైన ఇందిరమ్మ లబ్ధిదారులు ఇంద్రమ్మ ఇల్లు రాక నష్టపోయారని ఒక్కొక్క గ్రామంలో ఇల్లు పొలాలు ఉన్న వారికి కాంగ్రెస్ కార్యకర్తలు ఇంద్రమ్మ కమిటీలు వేయడం వల్ల వారికి నచ్చిన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం నిరుపేదలైన లబ్ధిదారులు నష్టపోయారు అన్నారు మరోపక్క యూరియా దొరకగా సొసైటీ కార్యాలయాల దగ్గర రైతులు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు క్యూలో నిలబడి తోపులాటలో యూరియా కోసం ప్రాణాలు పణంగా పెట్టి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. గతంలో యూరియా కొరత అనేది గతంలో ఏ ప్రభుత్వంలో లేదని ఈ ప్రభుత్వం వచ్చాకే ఇలాంటి సమస్యలు ఎక్కువైతున్నాయని వారు తెలిపారు. తక్షణమే గ్రామాలలో కూడా యూరియా రైతులకు అందుబాటులో ఉంచేలా చూడాలని వారు కోరారు. గ్రామాలలో ఇందిరమ్మ లబ్ధిదారులను ఎంపిక చేసే ప్రక్రియలో ఇంద్రమ్మ కమిటీలను రద్దుచేసి నిజమైన అర్హులకే అధికారుల చేత సర్వేలు నిర్వహించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు పత్తి పెసర రైతులు పూర్తిస్థాయిలో నష్టపోయి తీరా పంట చేతికి వచ్చేసరికి వర్షాలతో వరదలతో పంటలు కొట్టుకుపోయి ఆత్మహత్యలు తీసుకునే పరిస్థితి దాపురించిందన్నారు. మధిర నియోజకవర్గంలో ఎక్కువ శాతం రైతులు పత్తి పెసర సాగు చేసి ఎకరానికి 50 వేల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి తీరా పంట చేతికి రాకపోయేసరికి రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టలాడుతున్నారన్నారు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టడం అప్పులు తీరక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది అన్నారు పాదయాత్రలో రేపల్లెవాడ గ్రామంలో వర్షాలకు నష్టపోయిన పత్తి పంటను పాదయాత్ర బృందం సందర్శించారు.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే నష్టపోయిన రైతులకు ఎకరానికి 50వేల రూపాయలు చొప్పున పత్తికి 20 వేలు రూపాయలు చొప్పున పెసరికి నష్టపరిహారం అందించాలనిరూపాయలు చొప్పున పెసరికి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ పాదయాత్రకు బిఆర్ఎస్ మండల కమిటీ సంఘీభావం తెలిపారు. తాసిల్దార్ కార్యాలయంలో ధర్మాన్ని నిర్వహించారు అనంతరం తాసిల్దార్ బాబ్జి ప్రసాద్ కి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సామినేని రామారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు, సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, సిపిఎం మండల కార్యదర్శి రాచ బంటి రాము వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వత్సవాయి జానకి రాములు కాటబత్తిని వీరబాబు రౌతు అప్పారావు మాదినేని రవి టిఆర్ఎస్ నాయకులు రమేష్ వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు మండల కార్యదర్శి బొడ్డు వెంకటరామయ్య ఎస్.కె షబ్బీర్ ఎస్ కే జానీ మియా పనుకోటి రత్నాకర్ మహిళలు చిన్నారులు తదితరులు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !