హాజరైన ప్రముఖ డ్రాక్టర్స్ డా.జడల రణధీర్,డా. కందుల అభిలాష్ రెడ్డి .
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండల కేంద్రంలో బుధవారం నాడు ప్రముఖ డాక్టర్స్ జడల రణధీర్ మరియు కందుల అభిలాష్ రెడ్డి కలిసి రమణ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ని ప్రారంభించారు.వారు మాట్లాడుతూ చింతకాని మండలంలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించడం లో ఉన్నత ప్రమాణాలు పాటించి ప్రజల మన్నలు పొందాలని రమణ డయాగ్నోస్టిక్స్ సెంటర్ నిర్వాహకులు గడ్డం విజయ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.కందుల అభిలాష్ రెడ్డి సొంత ఊరు చింతకాని కావడం తో సొంత ఊరిలో ఒక మంచి డయాగ్నస్టిక్స్ సెంటర్ ప్రారంభోత్సవం కి రావటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వర్రావు,పోతినేని సుదర్శన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మడుపల్లి భాస్కర్,చింతకాని సబ్ ఇన్స్పెక్టర్ వీరేందర్,బీ ఆర్ ఎస్ జిల్లా నాయకులు మంకెన రమేష్,కిలారు జగన్మోహనరావు,సరోజిని,మనోహర్,గడ్డం రమణ,పొనుగోటి రత్నాకర్,కోటేశ్వర్రావు,కందుల సిద్ధ రెడ్డి,షాబిర్ ఖాన్,జానిమియా మరియు తదితరులు పాల్గొన్నారు.









