పినపాక
పినపాక మండలంలో వివిధ పాఠశాలలలో జరుగుతున్న సివిల్ వర్క్ ను అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనీ ) సౌరబ్ శర్మ ఆకస్మికంగా పరిశీలించారు. బుధవారం ఆయన ఈ సందర్శనలో భాగంగా నూతన భవిత నిర్మాణాలు, దివ్యాంగుల నూతన మరుగుదొడ్లు నిర్మాణం, భవిత కేంద్రాల మరమ్మత్తులు, కేజీబీవీ లలో మరమ్మత్తులు, పి ఎం ఎస్హెచ్ఆర్ఐ ల్యాబ్ నిర్మాణం వంటి పనులను పరిశీలించారు.పనులు నాణ్యంగా ఉండాలని, ఎస్టిమేషన్ కు, డిజైన్ కు అనుగుణంగా నిర్మాణాలు ఉండాలని ఇంజనీర్ లకు సూచించారు.ఈ సందర్శనలో జిల్లా విద్యాశాఖ సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ యస్. కె. సైదులు, డిఈ నాగేశ్వర చారి, ఏ ఈ సత్య శ్రీనివాస్, మండల విద్యాధికారులు, వీరాస్వామి, నాగయ్య, ఐఈఆర్బి లు జాన్సీ, నాగశ్రీ, అంబికా, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 26









