నేటి గదర్ న్యూస్, వైరా/తల్లాడ:-
తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన గొడ్ల సంధ్యారాణి ఎంబిబిఎస్ సీటు సాధించింది. ఈ సందర్భంగా వైరా మండలం కేజీ సిరిపురం గ్రామానికి చెందిన సామాజిక సేవకులు షేక్.లతీఫ్ శుక్రవారం ఆమెను శాలువాలతో సన్మానించి సత్కరించారు. కొంత నగదు ఆర్థిక సహాయాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేద కుటుంబంలో పుట్టి ఎంబిబిఎస్ సీట్ సాధించటం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ చదువులో రాణిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిరిపురం గ్రామ పెద్దలు మోరంపూడి మోహన్ రావు, సంధ్యారాణి తల్లిదండ్రులు బాబు, వసంత, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 77









