నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి:
చింతకాని మండల కేంద్రంలోని చింతకాని-కొణిజర్ల రోడ్డు మరియు చింతకాని-జగన్నాథపురం రోడ్ లో గత కొంత కాలంగా రోడ్ పై గుంతలు ఏర్పడి సి సి రోడ్డు లో ని ఇనుప చువ్వలు బయట పడి ప్రమాదభరితంగా మారాయి.వాహన దారుల అవస్థలు గ్రహించిన చింతకాని ఎస్ ఐ వీరేందర్ శుక్రవారం నాడు సిమెంట్ కాంక్రిట్ తో గుంతలు పూడ్పించారు.చింతకాని మండలంలో బాధ్యతలు చేపట్టిన నాటి నుండి తన దైన శైలిలో మండల ప్రజలకు అన్ని విధాలుగా సోషల్ రెస్పాన్స్ తీసుకొని మండల ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్న ఎస్ ఐ వీరేందర్ సేవలను మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 48









