+91 95819 05907

తల్లి పారిశుద్ధ్య కార్మికురాలు.. కుమారుడు డిప్యూటీ కలెక్టర్‌..

దుర్భర పేదరికాన్ని ఓడించి గ్రూప్ -1 విజేతగా నిలిచిన మురళి.

ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో గల యూ పి ఎచ్ కాలనీ మురళి సక్సెస్ స్టోరీ.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
సతీష్ కుమార్ జినుగు.

మూడేళ్ల ప్రాయంలోనే తండ్రి అనారోగ్యంతో చనిపోయారు. తల్లేమో పారిశుద్ధ్య కార్మికులు. ఆమె అనారోగ్యం పాలైతే ఖర్చుల కోసం ఉన్న ఇంటినీ అమ్మేశారు. ఇలాంటి కఠిన పరిస్థితులు, దుర్భర పేదరికాన్ని అనుభవించినా.. ఆ యువకుడు తనపై తాను నమ్మకం కోల్పోలేదు. చదువే ఆయుధంగా మార్చుకొని కొలువుల పంట పండించారు. ఆఖరికి రాష్ట్రంలోనే అత్యున్నత సర్వీసు సాధించారు. ఖమ్మం నగరం యూపీహెచ్‌ కాలనీకి చెందిన మురళి గ్రూప్‌-1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఆటో డ్రైవర్‌గా పనిచేసే ఆయన తండ్రి తన చిన్నతనంలోనే చనిపోయారు. కుటుంబ పోషణ కోసం తల్లి ఖమ్మం పురపాలకంలో ఒప్పంద కార్మికురాలిగా చేసేవారు.కుటుంబ పరిస్థితి నేపథ్యంలో మురళి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ.. అంతా క్రైస్తవ మైనారిటీ విద్యాలయాల్లో ఉచితంగా చదువుకున్నారు. దూరవిద్యలో ఏంబీఏ పూర్తి చేశారు. ఈ క్రమంలో తల్లి తీవ్ర అనారోగ్యం పాలవటంతో చికిత్స కోసం ఉన్న ఇంటినీ అమ్మేశారు. ఆ సమయంలో అయినవారెవరూ ఆదుకోలేదు. ఎలాగైనా ఉన్నత శిఖరాలు అందుకోవాలని ప్రభుత్వ కొలువే లక్ష్యంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. 2018 నుంచి ఉద్యోగ విజయాలు సాధిస్తూ వస్తున్నారు. 2018లో టీజీఎస్పీ స్పెషల్‌ కానిస్టేబుల్‌గా, 2020లో సివిల్‌ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. 2024లో టీజీపీఎస్సీ గ్రూప్‌-4 ఫలితాల్లో జూనియర్‌ అకౌంటెంట్‌ కొలువు సాధించారు. ఖమ్మం నగరపాలక సంస్థలో పని చేస్తూనే గ్రూప్‌-1కు ప్రిపేర్‌ అయ్యారు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

AP:ఆ ఆధికారి కి18 ఏళ్ల సర్వీస్…30 బదిలీలు

*ట్రాన్స్‌ఫర్ స్టార్..బదిలీలే ఆయనకు బహుమతులు..* *18 ఏళ్లలో 30 సార్లు.. వ్యవస్థను వణికించిన నిజాయితీ..* *ఖాకీ నిబద్ధతకు ‘ట్రాన్స్‌ఫర్’ పరీక్ష..* *తగ్గని పౌరుషం.. లొంగని శ్రీరామ్..* *రాజీపడితే కుర్చీ.. ధర్మం కోసం నిలబడితే బదిలీ..ఇదీ

Read More »

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం.

వైరాలో హోరెత్తిన BRS,CPM పార్టీ ఎన్నికల ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మున్సిపాలిటీ పరిధిలోని బిఆర్ఎస్, సిపిఎం పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు ,సిపిఎం బలపర్చిన బిఆర్ఎస్ చైర్పర్సన్ అభ్యర్థి

Read More »

KCR: చట్ట విరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధం :కేసీఆర్

బ్రేకింగ్ న్యూస్ జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి తన వివరణ ఇచ్చిన కేసీఆర్ బాధ్యతాయుత పౌరుడిగా, ప్రతిపక్ష నేతగా విచారణకు సహకరిస్తానని కేసీఆర్

Read More »

ఖమ్మం:ముగిసిన సీఎం కప్ క్రీడోత్సవాలు

నేటి గదర్ న్యూస్, ఖమ్మం టౌన్ : గత మూడు రోజులుగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో కొనసాగుతున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడలు శనివారం ముగిసాయి. చివరి రోజు

Read More »

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్!

అశ్వారావుపేటలో హోరెత్తిన ఎన్నికల ప్రచారం: కారు గుర్తు గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు’ బిఆర్ఎస్! ​అభివృద్ధికి పట్టం కట్టండి.. భారీ మెజారిటీతో గెలిపించండి: మున్సిపల్ చైర్‌పర్సన్ కాసాని నాగశేష పద్మ పిలుపు నేటి గద్దర్

Read More »

పదవి విరమణ పొందిన పోలీసు లకు సన్మానం★ సీపీ సునీల్ దత్ చే ఘన సత్కారం

పదవి విరమణ పొందిన పోలీసు దేవులకు సన్మానం సీపీ సునీల్ దత్ చే సత్కారం ఖమ్మం, నేటి గదర్ న్యూస్: ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్

Read More »

 Don't Miss this News !