మాసాయిపేట బిజెపి మండల అధ్యక్షులు మోలుగు నరేందర్ రెడ్డి.
నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) సెప్టెంబర్ 28.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని పోతాన్ పల్లి గ్రామానికి చెందిన దేవుళ్ల ఆనంద్కు ఎంపీ రఘునందన్ రావు సహకారంతో 33 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఇవ్వడం జరిగింది. అలాగే చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన కేతావత్ రజిత లింగం కు 16 వేల రూపాయల చెక్కు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాసాయిపేట మండల అధ్యక్షుడు మొలుగు నాగేందర్ రెడ్డి , కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు తలారి మల్లేష్ , ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు ఆకారం బాబు , మండల ప్రధాన కార్యదర్శి రవికిరణ్ , భూత్ అధ్యక్షులు నరేందర్ , రాజు , నరేష్ , సీనియర్ నాయకులు బాలకృష్ణ , సంతోష్ రెడ్డి , శ్రీకాంత్ గౌడ్ , ప్రశాంత్ , నారాయణరెడ్డి , మాజీ బూత్ అధ్యక్షులు వెంకట్ , తదితరులు పాల్గొన్నారు.









