వైరా సర్కిల్ ఇన్స్పెక్టర్: సాగర్
__నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన: ఎస్ ఐ వీరేందర్__
నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి :
చింతకాని మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లలో ఎస్ ఐ వీరేందర్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో వైరా సి ఐ సాగర్ పాల్గొని మాట్లాడుతూ దేవీనవరాత్రి ఉత్సవాల ముగింపు నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని,
డిజెలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నిభందనలు ఉల్లంఘించరాదాని,చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చట్టరీత్యా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఎస్ ఐ వీరేందర్ మాట్లాడుతూ రామక్రిష్ణపురం,అనంతసాగర్,
పాతర్లపాడు గ్రామాలు పోలీస్ నిఘాలో ఉన్నాయని అలజడులు సృష్టిస్తే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Post Views: 94









