+91 95819 05907

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించి సత్తా చాటాలి: బీఆర్ఎస్ పార్టీ నాయకులు యల్లంకి సత్యనారాయణ, లకావత్ గిరిబాబు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధులను గెలిపించి మన సత్తా చాటాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు యల్లంకి సత్యనారాయణ, లకావత్ గిరిబాబు.

నేటి గదర్ న్యూస్, వైరా:-
ఈ రోజు జూలూరుపాడు మండల కేంద్రంలో యల్లంకి సత్యనారాయణ నివాసంలో జూలూరుపాడు మండల పార్టీ కమిటి ఆధ్వర్యములో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశము నిర్వహించారు. ఈ సమావేశానికి వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు హాజరై జూలూరుపాడు మండల, గ్రామ కమిటి కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో మన BRS పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని, విభేదాలను పక్కన పెట్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలలో BRS పార్టీ అభ్యర్ధులు ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలనీ తెలిపారు.. ఇందుకోసం కార్యకర్తలంతా సమష్టిగా ముందుకెళ్లాల్సిన అవసరముంది.
స్థానిక సంస్థల ఎన్నికలను నాయకులు, కార్యకర్తలు ఆషామాషీగా తీసుకోవద్దని, రాత్రిబవంళ్లు కష్టపడి పనిచేస్తేనే మన లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మన పార్టీ గెలువకుండా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడానికి కాంగ్రెస్‌ పార్టీ ఇబ్బందులకు గురిచేసే అవకాశమున్నదని పేర్కొన్నారు.
మనమంతా ధైర్యంగా ముందుకెళ్లి ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకోవల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి తప్పుచేశామని ప్రజలు పశ్చాత్తాపపడుతున్నాని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సక్రమంగా అమలు చేయలేదని తెలిపారు. ముఖ్యంగా రైతులు యూరియా కోసం అల్లాడుతున్నారని ఒక్క యూరియా బస్తా కోసం రోజుల తరబడి సహకార సంఘాల ఎదుట నిలబడుతున్నారని పేర్కొన్నారు
పింఛన్లు పెంచలేదని, రుణమాఫీ చేయలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేదన్నారు. కోర్టు ఆదేశాలతోనే ఎన్నికల నిర్వహణకు ముందుకొచ్చిందని, ఈ ఎన్నికల్లో కూడా ఆ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని, పంతాలకు వెళ్లకుండా పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలనిబీఆర్ ఎస్ పార్టీ నాయకులు యల్లంకి సత్యనారాయణ , లకావత్ గిరిబాబు అన్నారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ చాపలమడుగు రామ్మూర్తి, లకావత్ హేమ్లా రెడ్డిబోయిన రాము, మాజీ ఎంపీపీ మూడు చిట్టిబాబు, యదలపల్లి వీరభద్రం, బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భూక్యా సేవా, దుద్దుకూరి కృష్ణ ప్రసాద్, కొడెం సీతాకుమారి, పదిమళ్ళ రాంబాబు, తాళ్లూరి రామారావు, సాయిని హరీష్, భూక్యా చందు, దిగిన్ని అప్పారావు, బానోత్ శంకర్, వెంకన్న మరియు తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !