నేటి గదర్ న్యూస్,చింతకాని ప్రతినిధి :
మండల పరిధిలోని చిన్నమండవ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మరీదు రామకృష్ణ నాన్నమ్మ మరీదు భద్రమ్మ (105) మృతి చెందారు. వారి భౌతికాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో… మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ & మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు, జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మడుపల్లి భాస్కర్ గౌడ్, మత్కేపల్లి మార్కెట్ డైరెక్టర్ బందెల నాగార్జున, మండల కిసాన్ అధ్యక్షులు కొప్పుల గోవిందరావు, కాంగ్రెస్ నాయకులు బొర్రా ప్రసాద్ రావు, ఓర్సు వీరభద్రం, మండల సేవ దళ్ అధ్యక్షులు పర్చగాని సతీష్, చిన్న మండవ గ్రామ శాఖ అధ్యక్షులు పర్చగాని వెంకట్ రాములు, గ్రామ కిసాన్ సెల్ అధ్యక్షులు పర్చగాని సీతయ్య, సీతంపేట గ్రామ శాఖ అధ్యక్షులు కొత్తపల్లి బసవయ్య, మాజీ ఎంపీటీసీ నారపోగు యాకోబు, నర్సింగుల బిక్షం, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









