పినపాక –
పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 20 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీ నుండి BRS పార్టీలో చేరారు. శనివారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో గల BRS పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గారి సమక్షంలో శనివారం చేరికలు జరిగాయి. సోడే సుధాకర్ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు చేరాయి. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి సత్తిబాబు, మాజీ ఎంపీపీ గుమ్మడి గాంధీ, మాజీ వైస్ ఎంపీపీ, దాట్ల వాసుబాబు, PACS చైర్మన్ రవివర్మ, ముఖ్య నాయకులు బుల్లిబాబు, బెడద సురేందర్, రాయల బాబు, ముక్కు వెంకటేశ్వరరెడ్డి, నాసర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 251









