+91 95819 05907

స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరాలి!

* మోదీ పథకాలను ప్రజలకు చేరవేయండి.
* *బూత్ స్థాయి నుండి విజయ యాత్ర ప్రారంభించాలి!*
* జిల్లాలో అన్ని స్థానాల నుంచి బిజెపి పోటీ చేస్తుంది.
** బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు.*

ఖమ్మం :

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన బలాన్ని నిరూపించి, ప్రతి గ్రామంలో కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. *ఆదివారం ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో మండల, జిల్లా నాయకులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ప్రధాన అతిథిగా పాల్గొన్నారు.* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ “కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం ప్రతి కార్యకర్త బాధ్యత. గ్రామాల అభివృద్ధి కేంద్ర నిధులతోనే సాధ్యమవుతోంది. ఆ నిధుల విలువను ప్రజలకు తెలియజేయండి” అని పిలుపునిచ్చారు. *“రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరేయడం లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకు సాగాలి.* ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉంది. గ్రామీణ ప్రజలకు అందిస్తున్న పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయాలి” అన్నారు.
“వచ్చే ఎన్నికల్లో వార్డు సభ్యుల నుండి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు బీజేపీ ఆధిపత్యం సాధించాలి. కార్యకర్తలే పార్టీకి బలమని, వారి శ్రమతోనే విజయం సాధ్యమని” తెలిపారు. పార్టీ బలోపేతానికి బూత్ స్థాయిలో కమిటీలను తక్షణం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. “ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో బూత్ వారీగా కార్యకర్తలను సమన్వయం చేయండి. స్థానిక నాయకులే ప్రజల విశ్వాసానికి ప్రతీక కావాలి. పార్టీ అభ్యర్థుల గెలుపు ద్వారా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ విధానాలను ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుంది” అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే హామీలన్నీ విఫలమై ప్రజలను మోసం చేసింది. ఇక ప్రజలు మార్పు కోరుతున్నారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వం కావాలని ప్రతి కార్యకర్త హృదయపూర్వకంగా నమ్ముతూ శ్రమించాలి” అని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రధాని మోదీ ప్రభుత్వమే గ్రామీణ అభివృద్ధి కేంద్రంగా నిలుస్తోంది. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, హర ఘర్ జల్, స్వచ్ఛ భారత్ మిషన్, పీఎం కిసాన్ వంటి పథకాలు గ్రామీణ భారతాన్ని మారుస్తున్నాయి. ఈ పథకాల ప్రభావం ఖమ్మం జిల్లాలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విజయాలను ప్రజలకు వివరించాలి” అన్నారు.అదేవిధంగా
జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు బీజేపీ పోటీ చేయనుందని ఆయన ప్రకటించారు.
“ఈ సారి ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాల్లో కాషాయ జెండా ఎగురనుంది. ప్రజలు మార్పు కోరుతున్నారు. గ్రామాల నుంచి ప్రజాభిప్రాయం బీజేపీ వైపు మొగ్గుచూపుతోంది” అని నమ్మకం వ్యక్తం చేశారు.
కార్యక్రమానికి ముందు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇవి రమేష్ కన్వీనర్ గా నిర్వహించిన ఈ సమావేశంలో బీజేపీ నేతలు గంట్యాల విద్యాసాగర్, వక్కలంక సుబ్రహ్మణ్యం, సన్నీ ఉదయ ప్రతాప్, మందడపు సుబ్బారావు, నున్న రవికుమార్ , పుల్లారావు యాదవ్, డాక్టర్ శీలం పాపారావు నంబూరి రామలింగేశ్వరరావు, వీరెల్లి రాజేష్, వేల్పుల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !