• హైకోర్టులో విచారణలో ఉండగా పిటిషన్ స్వీకరించలేమన్న ధర్మాసనం..
స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ.. ☟
హైకోర్టులో ఇదే అంశంపై రెండు పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాదులు.
ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఎందుకు ఫైల్ చేశారని పిటిషనర్ న్యాయవాదిని ప్రశ్నించిన జస్టిస్ విక్రంనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం.
రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులు సిద్దార్ధదవే, అభిషేక్ సింఘ్వీ, ఎడిఎన్ రావు..
పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
హైకోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్నందున విచారణకు స్వీకరించలేమన్న ధర్మాసనం.
ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించిన ధర్మాసనం.
హైకోర్టు స్టే ఇవ్వలేదని… అందుకే సుప్రీంకోర్టుకు వచ్చామన్న పిటిషనర్ తరపు న్యాయవాది.
స్టే ఇవ్వకపోతే.. సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా.!? అని ప్రశ్నించి.. పిటషన్ డిస్మిస్ చేసిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం.









