నేటి గదర్ న్యూస్, పినపాక
మిషన్ భగీరథ పైప్లైన్ సమస్యతో తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్న బోటుగూడెం వాసుల సమస్యపై పినపాక ఎంపీఓ తక్షణమే స్పందించారు. సోమవారం పినపాక మండలం బోటుగూడెం గ్రామపంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య ఉందని స్థానిక కాంగ్రెస్ నాయకులు కొండేరు సంపత్ తెలపగానే ఎంపీఓ వెంకటేశ్వరరావు తక్షణమే ఆ ప్రాంతాన్ని సందర్శించారు. రెండు మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అప్పటిదాకా పంచాయతీ ట్రాక్టర్ల తో నీటిని అందిస్తామని ఆయన తెలియజేశారు. పంచాయతీ ట్రాక్టర్ ద్వారా తాగునీటిని సమస్య లేకుండా చూడాలని స్థానిక సెక్రటరీ జ్యోతిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపిఒకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్య తెలిసిన వెంటనే స్పందించటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు
Post Views: 19









